Wednesday, January 22, 2025

దీపావళికి ముందు పసిడి పరుగులు

- Advertisement -
- Advertisement -

దీపావళికి ముందు బంగారం ధరలు భగ్గుమన్నాయి. పండుగ సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడికి డిమాండ్ పెరుగుతుండడంతో దేశీయంగా ధరలు దూసుకువెళుతున్నాయి. పసిడి శుక్రవారం రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 80 వేలకు చేరువ అయింది. స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీలో శుక్రవారం రూ. 79900గా నమోదైంది. గురువారంతో పోలిస్తే రూ. 550 మేర పెరిగింది. మరొక వైపు, ఫ్యూచర్ మార్కెట్‌లోను బంగారం జోరు కొనసాగింది. డిసెంబర్ నెల డెలివరీకి గాను 10 గ్రాముల బంగారం ధర రూ. 77620 వద్ద నమోదైంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వర్ణం ధర రూ. 870 మేర పెరిగి రూ. 78980కి చేరుకుంది. అంతకు ముందు ఇది రూ. 78100గా ఉన్నది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 మేర పెరిగి రూ. 72400కి ఎగబాకింది. బంగారం మార్గాన్ని అనుసరిస్తుండే వెండి కూడా భారీగానే పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండిపై రూ. 1000 మేర పెరిగి రూ. 94500కు చేరుకున్నది. హైదరాబాద్‌లో కిలో వెండిపై ఏకంగా రూ. 2000 మేర పెరిగి రూ. 105000కి ఎగబాకింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News