Monday, December 23, 2024

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…వాస్తు నిపుణులు విఎల్‌ఎన్ కుటుంబం మధురానగర్‌లో ఉంటున్నారు. ఇంటిని కొనుగోలు చేసేందుకు బ్యాంకులో ఉన్న నగదు 4కోట్లను తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టారు. పనిమీద కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని రూ.4కోట్ల రూపాయలు, బంగారు ఆభరణాలు దొంగలు చోరీ చేశారు. ఊరి నుంచి వచ్చి చూసేసరికి ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడిఉన్నది చూసి అనుమానం వచ్చింది. వెంటనే ఇంట్లోని బీరువాలను తనిఖీ చేయగా డబ్బులు, బంగారు ఆభరణాలు కన్పించలేదు. వెంటనే మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News