Monday, December 23, 2024

రజనీకాంత్ కుమార్తె ఇంట్లో బంగారు నగల చోరీ

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్(41) ఇంట్లో బంగారు నగలు చోరీ అయ్యాయి. తన ఇంట్లోని లాకర్‌లో ఉంచిన బంగారు నగలు కనిపించడం లేదంటూ ఐశ్వర్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులపైనే తనకు అనుమానం ఉన్నదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇద్దరు కుమారులతో కలసి ఆమె తన ఇంట్లో నివసిస్తున్నారు. తాను ఆ ఇంట్లో ఎక్కువ కాలం నివసించడం లేదని, తన పనివాళ్లే ఇంటికి తరచు వెళ్లి శుభ్రం చేస్తుంటారని ఐశ్యర్య తెలిపారు. మాయమైన బంగారు నగల విలువ రూ. 3.6 లక్షలని ఆమె చెప్పినప్పటికీ వాటి విలువ అంతకన్నా చాలా ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. సినీ దర్శక నిర్మాత అయిన ఐశ్వర్య ప్రస్తుతం విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా లాల సలాం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె తండ్రి రజినీకాంత్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News