Monday, December 23, 2024

గోల్డ్ లోన్ తీసుకోవడం ఎలా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వ్యక్తుల తమ అవసరాల కోసం బ్యాంకు రుణాలు, ఇతర మాద్యమాలపై ఎక్కువగా ఆధారపడతారు. అత్యవసర పరిస్థితుల్లో రుణం కోసం చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. తెలిసిన వారినో లేదా బ్యాంకులు, బంగారం రుణం సంస్థలను ఆశ్రయించాల్సి వస్తుంది. అయితే బంగారం ద్వారా ఇచ్చే రుణాలకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.

గోల్డ్ లోన్ తీసుకోవడం ఎలా?

సులభమైన ప్రమాణాలు: గోల్డ్ లోన్ కోసం ప్రమాణాలు ఇతర రుణాల కంటే చాలా సులభతరంగా ఉంటాయి. ఇక్కడ మీ క్రెడిట్ స్కోర్ లేదా ఇతర హామీలు పెద్దగా పట్టించుకోవు. మీ బంగారం నాణ్యత, విలువ ఆధారంగా రుణం లభిస్తుంది.

తక్కువ సమయంలో రుణం: అత్యవసర సమయాల్లో మీకు వెంటనే డబ్బు అవసరమైనప్పుడు తక్షణమే రుణం పొందడం కష్టమైన విషయం, కానీ బంగారం రుణం విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నమైంది. తక్షణమే రుణం పొందే వెసులుబాటు ఉంటుంది.

పోటీ వడ్డీ రేట్లు: సంక్షోభ సమయాల్లో వ్యక్తిగత రుణాలు, ఆస్తి రుణాలు, కార్పొరేట్ రుణాలు వంటి ఇతర రుణాలతో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లకు బంగారు రుణాలు సులభంగా లభిస్తాయి. అందుకే వీటికి డిమాండ్ పెరుగుతోంది.

ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్స్: గోల్డ్ లోన్ విషయంలో రుణగ్రహీతకు రుణాన్ని తిరిగి చెల్లించడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. ఉదాహరణకు మీకు కావాలంటే మీరు ప్రతి నెలా వడ్డీని మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. ఇతర ఎంపికలు చాలా ఉంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News