Wednesday, January 22, 2025

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గోల్డ్‌మెడల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సింగరేణి సంస్థ చేస్తున్న సమాజహిత కార్యక్రమాలకు గుర్తింపుగా రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ గోల్డ్‌మెడల్‌ను ప్రదానం చేసింది. రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా గురువారం సింగరేణి డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణ రావు, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్‌కుమార్ సూర్లకు బహుకరించారు. హైదరాబాద్‌లోని రాజభవన్ దర్భార్ హాల్లో జరిగిన రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో ఈ మెడల్‌ను గవర్నర్ గురువారం అందజేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తమ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకుకు ఆధునిక అంబులెన్స్‌ను గతేడాది బహుకరించింది.
సింగరేణి సేవలకు గుర్తింపు
ఈ సందర్భంగా సింగరేణి నిర్వాహకులు మాట్లాడుతూ సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సమీప గ్రామాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించిందని, వేలాది పండ్ల మొక్కలను పంపిణీ చేసిందన్నారు. ప్రతినెల ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోందని, అలాగే అంబులెన్స్ కూడా బహుకరించిందని, రెడ్‌క్రాస్ అందించిన గోల్డ్ మెడల్‌తో మరింత స్ఫూర్తి పొందుతూ సేవా కార్యక్రమాలను మరింతగా ద్విగుణీకరిస్తామని వారు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News