Saturday, December 28, 2024

తెలంగాణకు మరో రెండు స్వర్ణాలు

- Advertisement -
- Advertisement -

Gold medal for Telangana in badminton mixed team category

మన తెలంగాణ/హైదరాబాద్: గుజరాత్ వేదికగా జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ మరో రెండు స్వర్ణాలు సాధించింది. సోమవారం బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో తెలంగాణకు పసిడి పతకం లభించింది. అంతేగాక మహిళల బాస్కెట్‌బాల్ టీమ్ ఈవెంట్‌లో కూడా రాష్ట్రానికి స్వర్ణం దక్కింది. ఇక మహిళల స్విమ్మింగ్‌లో వ్రితి అగర్వాల్ రజతం సాధించింది. దీంతో పాటు పురుషుల రోయింగ్ టీమ్ విభాగంలో తెలంగాణకు కాంస్యం లభించింది. బ్యాడ్మింటన్ విభాగంలో తెలంగాణ మిక్సడ్ టీమ్ 32 తేడాతో మహారాష్ట్రను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. సాయి ప్రణీత్ తెలంగాణ విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్టార్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించి తెలంగాణకు స్వర్ణం సాధించి పెట్టాడు. మరోవైపు బాస్కెట్‌బాల్‌లో తెలంగాణ మహిళల టీమ్ 1733 తేడాతో కేరళను ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News