Sunday, December 22, 2024

తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిశ్కా అగర్వాల్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిశ్కా అగర్వాల్ మరోసారి సంచలనం సృష్టించింది. కేరళ వేదికగా జరుగుతున్న 57వ జాతీయ జూనియర్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో నిశ్కా అగర్వాల్ స్వర్ణ పతకాన్ని సాధించింది. కాగా ఒక నెల వ్యవధిలో ఇది నిశ్కా సాధించిన ఐదో స్వర్ణ పతకం కావడం విశేషం.

సోమవారం జరిగిన ఫైనల్లో నిశ్కా అసాధారణ ఆటతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో స్వర్ణం సాధించిన తెలుగు జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పింది. చివరిసారి అరుణా రెడ్డి జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణం సాధించిన తెలుగు క్రీడాకారిణిగా నిలిచింది. తాజాగా నిశ్కా ఆమె సరసన చోటు సంపాదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News