Thursday, January 23, 2025

ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి గోల్డ్ మెడల్…!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ -2023లో భారతదేశానికి చెందిన విద్యార్థులు మూడు స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించారు. నారాయణకు చెందిన మెహుల్ బౌరాడ్ గోల్ మెడల్ సాధించాడు. ఇతడు నారాయణ కాలేజ్ విద్యార్థి కావటం మరో విశేషం. ఢిల్లీకి చెందిన ఆదిత్య, పుణేకు చెందిన ధ్రువ్ షాలకు కూడా స్వర్ణ పతకాలు దక్కగా, చండీగడ్‌కు చెందిన రాఘవ్ గోయల్, చత్తీస్‌గడ్‌కు చెందిన రిథమ్ కేడియా రజత పతకాలు సాధించారు. భారత్ నుంచి మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా, అందరూ పతకాలు నెగ్గడం విశేషం.

ఈ సందర్భంగా మెహుల్ మాట్లాడుతూ నారాయణ ప్రోగ్రామ్ టీచర్ల ప్రోత్సాహంతోనే ఈ ఘనవిజయం సాధ్యమైనట్లు తెలిపాడు. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ఇంటి ముంబాయిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించారు మెహుల్, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. అదే విధంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ సింధూర మరియు పి.శరణి మాట్లాడుతూ ఈ గర్వించదగ్గ క్షణాన్ని పంచుకుంటూ, విద్యార్థి మెహుల్ అతని తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. అవిశ్రాంతంగా మద్దతునిచ్చిన అధ్యాపకులు, మార్గదర్శకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News