- Advertisement -
రాజస్థాన్‌లోని బికనేర్‌లో మహిళా పవర్ లిఫ్టర్ యశ్తికా ఆచార్య (17) మృతి చెందారు. జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు 270 కిలోల రాడ్ మెడపై పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు పోలీస్‌లు వెల్లడించారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణపతక విజేతగా నిలిచారు. యశ్తిక మరణంతో విషాదం నెలకొంది. ఈ సంఘటనలో ట్రైనర్‌కు కూడా స్వల్పంగా గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని, శవపరీక్ష తరువాత ఆమె భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పోలీసులు వెల్లడించారు.
- Advertisement -