Monday, December 23, 2024

ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు

- Advertisement -
- Advertisement -

అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఐకెఏ, కలినరీ ఒలింపిక్స్ 2024లో భారత దేశానికి పతకాల పంట పండింది. ఈ మేరకు చెన్నైలోని అమృత ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగిన ఈ ఒలింపిక్స్ 2024లో 3 బంగారు పతకాలతో సహా మొత్తం 10 వివిధ పతకాలను గెలుచుకున్నారు.

ఒలింపిక్స్‌లో బంగారు పతకాలను సాధించినందుకు గాను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ మేరకు వారిని అభినందించారు. ఒలింపిక్స్ 2024లో పతకాలు సాధించిన వారిని ఈ మేరకు చెన్నై అమృత ఇంటర్‌నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ హోటల్ మేనేజ్‌మెంట్ ఛైర్మన్ భూమి నాథన్‌తో కలిసి వారిని ఘనంగా అభినందించారు. ప్రతిష్టాత్మక ఐకెఏ కలినరి ఒలింపిక్స్ 2024లో బంగారు పతకాలు సాధించిన వారిని కిషన్ రెడ్డి ఘనంగా సన్మానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News