- Advertisement -
పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. నిన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. దీపావళి పండగ ముందు రాకెట్ వేగంతో దూసుకెళ్లిన పసిడి ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో తులం బంగారం రూ.80 వేలు దాటింది. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.490 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గింది.
ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.79,800కు తగ్గగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,150కు చేరుకుంది.ఇక, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది.
- Advertisement -