Monday, December 23, 2024

రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. తులం @రూ.80వేలు

- Advertisement -
- Advertisement -

పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు సామాన్య జనాలకు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో తులం బంగారం రూ.80 వేలు దాటింది. తాజాగా శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి.  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.650 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,290కు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,600గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News