Saturday, April 12, 2025

ట్రంప్ ఎఫెక్ట్.. తగ్గుతున్న బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

మరోసారి బంగారం ధరలు తగ్గాయి. అగ్ర రాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్ంప్ ఇటీవల సుంకాలు విధించడంతో పసిడి ధరలు పతనం దిశగా కొనసాగుతున్నాయి. దీంతో వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గాయి.

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 280 తగ్గి 90,380 రూపాయలకు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి 82,850 రూపాయలకు తగ్గింది. వెండి ధర కూడా రూ.100 తగ్గి.. కేజీ రూ.1,02,900కి చేరుకుంది. ఎపిలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News