Wednesday, January 22, 2025

కాస్త తగ్గిన బంగారం ధర

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు ఒకింత దిగి వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో పది గ్రాముల మేలిమి పసిడి ధర రూ. 73 వేలకు పైగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే స్థాయిలో పుత్తడి ధరలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67590గా ఉంది. ఆ మూడు నగరాల్లో మేలిమి బంగారం (24 క్యారెట్ల) ధర రూ. 73740గా ఉంది.

వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 92400గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 67740గాను, మేలిమి బంగారం ధర రూ.73890గాను ఉన్నాయి. ముంబయిలో ధర ఒకింత తక్కువగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 67590గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73740గా ఉంది. చెన్నైలో ఆ రెండు రకాల బంగారం ధరలు వరుసగా రూ. 67690గాను, రూ, 73840గాను ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News