Monday, November 25, 2024

వచ్చే ఏడాది రూ.61,000కు పసిడి!

- Advertisement -
- Advertisement -

ముంబై : బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకీ రేట్లు మరింత పెరుగుతున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో బంగారం 10 గ్రాములు(24 క్యారెట్) ధర రూ.160 పెరిగి రూ.54,110కి చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో రూ.160 పెరిగి రూ.54,260కి చేరగా, చెన్నైలో రూ.320 పెరిగి రూ.55,040కి చేరింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్లో బంగారం ధర రూ.316 పెరిగి రూ.53,972కి చేరుకుంది. ఇక వెండి గురించి మాట్లాడితే 66 వేలకు చేరుకుంది. బులియన్ మార్కెట్‌లో కిలో ధర రూ.1,457 పెరిగి రూ.65,891కి చేరింది. డిసెంబర్ 2న ఇది రూ.64,434 వద్ద ఉంది.

వచ్చే ఏడాది రూ.61,000కు పసిడి

కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా మాట్లాడుతూ, వచ్చే ఏడాది బంగారం రూ.61,000 కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామని అన్నారు. జనవరి 22 నుంచి చైనాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఈ సమయంలో బంగారం కొనుగోలు అక్కడ అత్యధికంగా ఉంటుందని అన్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో బంగారం ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News