Tuesday, April 22, 2025

అమ్మో..లక్ష

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.99,800లకు చేరిక
మూడు శాతం జిఎస్‌టి కలిపితే 10గ్రాములకు రూ. 1,02,794కు
చేరుకున్న ధర డాలర్ బలహీనం కావడం, అమెరికా చైనా మధ్య
సుంకాల సమరంతో భారీగా పెరుగుతున్న ధర వెండి ధరలు
కూడా రికార్డు స్థాయికి చేరిక కిలో రూ.98వేలు పలికిన ధర

న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. పది గ్రాముల పసిడి ధర జిఎస్‌టితో కలిపి రూ.1 లక్ష మార్క్‌ను దాటింది. సోమవారం 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,794 కి చేరిం ది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రూ.99,800 వద్ద ట్రేడ్ అవుతూ కనిపించింది. ఇది జిఎస్‌టితో కలిపి రూ.లక్ష పైనే ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర రూ.3,405 డాలర్లకు పెరిగింది. ఈ కారణంగానే భారత మార్కెట్లో వీటి ధర ఒక్కసారిగా జంప్ చేశాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్) ధర రూ. 99,660 వద్ద ఉంది. అమెరికా, చైనా మధ్య వాణి జ్య యుద్దం అనిశ్చితి, డాలర్ బలహీనపడడం వల్ల బంగారం ధర పెరుగుతోంది. రెండు అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధం అస్థిర అంతర్జాతీయ వాతావరణాన్ని సృష్టించింది. ఈ కారణంగానే సురక్షితమైన పెట్టుబడి ఎంపిక అయిన బంగారం ధర గణనీయంగా పెరుగుతోంది. పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడంతో పసిడికి డిమాండ్ భారీగా పెరిగింది. సోమవారం ఫ్యూచర్స్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే బంగారం ధర పెద్ద ఎత్తున పెరిగింది. ఈ ధరలో కొనడం ఇప్పుడు సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

అక్షయ తృతీయకు ముందే..
అక్షయ తృతీయ ఏప్రిల్ 30న రాబోతోంది. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు బంగారం ధర లక్ష దాటుతుందని అంచనా వేశారు. కానీ అంతకుముందే బంగారం ధర లక్ష దాటింది. దీంతో అక్షయ తృతీయ నాడు బంగారం ధర కొత్త గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. జనవరి నుంచి బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జనవరి 1న 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.77,577 ఉండగా, జనవరి 31న ఇది రూ.83,107కి చేరుకుంది. ఆ తర్వాత బంగారం ధర ఇప్పుడు 10 గ్రాములకు 99,500కి చేరుకుంది. రాబోయే కాలంలో బంగారం ధర పెరుగుతూనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News