Sunday, December 22, 2024

పెరుగుతున్న బంగారం ధర

- Advertisement -
- Advertisement -

ముంబై : పండుగ సీజన్‌లో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. శుక్రవారం బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.671 పెరిగి రూ.60,611కి చేరుకుంది.

వెండి ధరలో స్వల్ప పెరుగుదల ఉంది. కిలో రూ.49 పెరిగి రూ.71,373కి చేరింది. అంతకుముందు ఇది రూ.71,324గా ఉంది. అక్టోబర్‌లో ఇప్పటివరకు బంగారం ధర రూ.2,800కు పైగా పెరిగింది. ఈ నెల ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర రూ.57,719 ఉండగా, ప్రస్తుతం రూ.60,611కి చేరింది. వెండి కిలో రూ.71,603 ఉండగా, ప్రస్తుతం రూ.71,373కి తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News