Thursday, January 16, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. ఇటీవల స్వల్పంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు సామన్య ప్రజలకు కొంత ఊరటనిచ్చాయి. మరోసారి పసిడి ధరలు షాకిచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1300 పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 పెరిగింది. తాజా పెరుగుదలతో హైదరాబాద్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) రూ.68,250కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వెండి ధర 74,450 పలుకుతోంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది.కేజీ వెండి ధరపై ఏకంగా రూ.3,500 పెరిగింది. దాంతో కేజీ వెండి దర రూ.95వేలకు చేరింది. విజయవాడలోనూ ఇవే ధరలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News