- Advertisement -
ప్రపంచ మార్కెట్ల సరళికి తగినట్లుగా దేశ రాజధానిలో బంగారం ధరలు సోమవారం ఫ్లాట్‌గా ముగిసాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలియజేసింది. పది గ్రాముల బంగారం ధర రూ.64200 మేర నమోదైంది. అయితే, వెండి ధరలు రూ. 200 మేర పతనమై కిలో రూ. 73800 వద్ద ముగిసాయి. గత ట్రేడ్‌లో వెండి ధర కిలో రూ. 74000 వద్ద ముగిసింది. ‘ఢిల్లీ మార్కెట్లలో స్పాట్ బంగారం (24 క్యారెట్లు) ధరలు పది గ్రాములకు రూ. 64200 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. మునుపటి ముగింపు ధరతో మార్పు లేదు’ అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లో కమోడిటీస్ సీనియర్ అనలిస్ట సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో కోమెక్స్‌లో స్పాట్ బంగారం ఔన్స్‌కు 2084 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మునుపటి ముగింపు స్థాయి కన్నా ఇది రెండు అమెరికన్ డాలర్లు అధికం. అయితే, వెండి ఔన్స్‌కు 23.09 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
- Advertisement -