- Advertisement -
ముంబై : ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.324 పెరిగి రూ.60,888కి చేరుకుంది. కాగా 18 క్యారెట్ల బంగారం ధర రూ.45,666కు పెరిగింది. అదే సమయంలో వెండి కూడా రూ.356 పెరిగి కిలో ధర రూ.71,360కి చేరుకుంది. అంతకుముందు ఇది రూ.71,004 గా ఉంది. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అక్టోబర్‌లో ఇప్పటివరకు బంగారం ధర రూ.3,000 కంటే ఎక్కువ పెరిగింది.
- Advertisement -