- Advertisement -
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. 2024లో పసిడి ధరలు భారీగా దిగొస్తున్నాయి. గతేడాది రూ.60వేల చేరువకు వెళ్లిన తులం బంగారం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొమ్మిది రోజుల్లోనే మూడు సార్లు భారీగా తగ్గింది. ఇక, మంగళవారం కూడా దేశంలో మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరపై 200 రూపాయలు తగ్గి రూ.57,800కు చేరుకుంది. 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధరపై 220 రూపాయలు తగ్గి రూ.63,050గా ఉంది. కిలో వెండి ధరపై రూ.200 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.77,800గా ఉంది.
- Advertisement -