- Advertisement -
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. బడ్జెట్ లో బంగారం, వెండి పై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం ధర రూ. 3 వేల వరకు పడిపోయింది.బంగారం మరియు వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించబడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.4000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 950 తగ్గింది. తులం బంగారం ధరరూ. 64 వేల మార్కుకు చేరింది.
- Advertisement -