Sunday, April 20, 2025

బంగారం..లకారం

- Advertisement -
- Advertisement -

రూ.లక్షకు చేరువలో బంగారం ధర 10గ్రాములకు
రూ.98వేలు దాటిన పసిడి ఒక్కరోజే రూ.1650
పెరిగిన రేటు రూ.99,400లకు చేరుకున్న
కిలో వెండి ధర

న్యూఢిల్లీ: బంగారం ధరలు కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బుధవారం పది గ్రాముల పసిడి ధర రూ.98,000 మార్క్‌ను దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,650 పెరిగి రూ.98,100 కి చేరుకుంది. మొత్తానికి పసిడి ధర లక్షకు చేరువ అవుతోంది. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యు ద్ధం పెరుగుతుండడంతో ప్రపంచ వ్యాప్తం గా బంగారం సురక్షితమై పెట్టుబడిగా భా వించి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ ప్రకారం, మంగళవారం నాడు 99.9 శాతం స్వచ్ఛత 10 గ్రా ముల బంగారం ధర రూ.96,450 కి చేరుకుంది. అయితే ఈ నెల 11న ఒక్క రోజే పసిడి ధర దాదాపు రూ.6,250 పెరిగింది. బుధవారం పది గ్రాముల పసిడి ధర మరుసటి రోజు రూ.1,650 పెరిగి రూ. 97,650కి చేరుకుంది. ఎంసిఎక్స్ మార్కెట్ల లో జూన్ డెలివరీకి గోల్డ్ ఫ్యూచర్ రూ. 1,984 (2.12 శాతం) పెరిగి రూ. 95,435కి చేరుకుంది. ఎల్‌కెపి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ విపి అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ, మరోసారి బం గారం ధర గణనీయమైన వృద్ధిని సాధించిం ది.

సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో కామెక్స్ గోల్డ్ 3,300 డాలర్లను దాటిందని అన్నారు. మరోవైపు కిలో వెండి ధర రూ.1900 పెరిగి రూ.99,400 కి చేరుకుంది. మంగళవారం నాడు కిలో వెం డి ధర రూ.97,500 గా ఉంది. జనవరి 1 నుంచి చూస్తే బంగారం దాదాపు రూ. 18,710 (23.56 శాతం) పెరిగింది. జనవరిలో ఈ బంగారం పది గ్రాముల ధర రూ.79,390 గా ఉంది. అదే సమయంలో వెండి ధర కూడా రూ.10,558 పెరిగి కిలో కు రూ.86,017 నుంచి రూ.99,000కి చేరుకుంది. ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర రూ.1.10 లక్షలకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అ మెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణి జ్య యుద్ధం, మాంద్యం భయాల కారణంగా ఈ సంవత్సరం బంగారం ఔన్సుకు 3,700 డాలర్లకు చేరుకోవచ్చు. విదేశీ పెట్టుబడి బ్యాంకు గోల్డ్‌న్ శాచ్స్ ఈ అంచనాను విడుదల చేసింది. అంతర్జాతీయ ధరల ప్రకారం లెక్కిస్తే, భారతదేశంలో 10 గ్రా. బంగారం ధర రూ.1.10 లక్షల వరకు పెరగవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News