సామాన్య జనాలకు బంగారం ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. దీంతో బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తులం బంగారం(24 క్యారెట్) రూ.72 వేలు దాటి పరుగులు పెడుతోంది. దీంతో బంగారం అందని ద్రాక్షగా మారింది. ఈక్రమంలో మంగళవారం స్వల్పంగా బంగారం ధరలు దిగి వచ్చాయి. ఈరోజు తులంపై రూ.10 తగ్గగా, కిలో వెండిపై రూ.100 తగ్గింది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,140 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,240కు చేరుకుంది. ఇక, కిలో వెండి ధర రూ.89,900గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,290 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,350గా ఉంది.
ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,140 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,240గా ఉంది.