Monday, December 23, 2024

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షలాగానే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలలో బంగారాన్ని వారి వారి స్థోమతకు తగ్గట్లుగా కొనుక్కుంటారు. కానీ పెరుగుతున్న బంగారం ధరలు చూస్తుంటే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ పెరుగుదలకు కారణం ద్రవ్యోల్భణం, ప్రపంచ ధరల్లో మార్పు, సెంట్రలో బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ముంబైలో 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 61,030గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 55,940గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.61,180గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.56,090గా ఉంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 61,030, 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 55, 940గా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 61,030, 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 55, 940గా ఉంది.

Read Also: తప్పుగా వినియోగిస్తే ఎఐతో హానికరం: గూగుల్ సిఇఒ

వెండి ధరలు:
ముంబైలో కిలో వెండి ధర రూ. 78,500, ఢిల్లీలో రూ. 78,500, హైదరాబాద్ లో రూ. 81,600, విజయవాడలో రూ. 81, 600 గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News