Sunday, December 22, 2024

గ్రేటర్‌లో బంగారు శుద్ది కేంద్రాల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -
రూ. 700 కోట్లు పెట్టుబడి
2500 మంది ఉపాధి అవకాశాలు
ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సంస్థలు

హైదరాబాద్: నగరంలో ప్రతి సంవత్సరం బంగరం కోనుగోళ్ళకు సంబంధించిన లావాదేవీలు సుమారు రూ.2.50 లక్షల కోట్ల నుంచి 4.50 లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా. వివాహాది శుభకార్యాల సమయంలో వీటి కోనుగోళ్ళు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గ్రేటర్ ప్రజలు అవసరాలకు సరిపడా బంగారాన్ని ఆభరణాల రూపంలో తీర్చాలంటే తలకు మించిన భారం అవుతుంది. ఇందుకు సంబంధించిన ముడిసరుకును దిగుమతి చేసుకుని వాటిని శుద్ది చేసి అభరణాలుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. బంగారానికి సంబంధించిన ఘనులు అమెరికా, ఉజ్బకిస్తాన్, ఇండోనేషియా, డోమైనికన్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా,కెనడా తదితర 10 దేశాల్లో ఉండగా మన దేశంలో మాత్రం కర్నాటక,ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్‌ల,ఒడిస్సాలలో మాత్రమే ఇందుకు సంబంధించిన ఘనులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సరుకును తీసుకు వచ్చి శుద్ది చేయాలంటే అందుకు సంబంధించిన బంగారు శుద్ది కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

సులభతర పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టి ఐపాస్‌తో అనేక ప్రయోజనాలు ఉండటంతో ప్రముఖ ఆభరణాల దిగ్గజాలు తమ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.ఈ నేపథ్యంలో రెండు ప్రధాన బంగారు శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్కు పరిధిలో ప్రత్యేక బంగారు క్లస్టర్‌లో రిఫైనరీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇండిస్ట్రియల్ పార్క్‌లో గోల్డ్‌తో సహా మూడు బంగారు శుద్ది కర్మాగారాలు ఉన్నాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దాని తయారీ యూనిట్‌ను పూర్తి చేయడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన అతిపెద్ద బంగారు శుద్ది కర్మాగారాన్ని డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు. కంపెనీ తయారీ యూనిట్, రిఫైనరీలో రూ,700 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 2500 మంది అభరణాల తయారీదారులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టిఎస్ ఐ పాస్ ద్వారా రత్నాలు,అభరణాల పరిశ్రమ, మరో 13 ఇతర రంగాలలో అద్భుతమైన వృద్దిని సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా టిఎస్ ఐ పాస్ ప్రభుత్వ ప్రతిష్టను పెంచిందంటున్నారు.ఆకర్షణీయమైన ప్రోత్సహకాలను అందించడం, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో స్కిల్స్‌ను అభివృద్ది చేసిన నైపుణ్యం కలిగిన కార్మికులుగా తీర్చిదిద్దిడం ద్వారా కార్మికుల కొరతను పరిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు. నారాయణ పేట,కరీంనగర్‌లో జ్యూవెల్లరి అసొసియేషన్లకు భారీ ఎత్తున జాబ్‌వర్క్‌ను అందించేందుకు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసు కుంటున్నట్లు తెలిపారు.

ఇండస్ట్రియల్ పార్కులో రిఫైనరీ కార్యకలపాల కోసం సంస్థ నిర్వహకులు రూ.1000కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అదనపు బంగారుశుద్ధి కర్మాగారాల ప్రాసెసింగ్ యూనిట్‌ల కోసం భూములు కూడా అందు బాటులో ఉన్నాయన్నారు. ఒక్క హైదరాబాద్‌లోని 5000లకు పైగా అవుట్‌లెట్‌లు వీటి ద్వారా 400 మంది తయారీదారులకు ఈ అభరణాల పరిశ్రమలో స్థానికంగా ఉన్నవారికి ఉపాధి లభిస్తుందంటున్నారు. ఇన్‌ఫార్మా మార్కెట్స్ హైదరాబాద్ జ్యూవెల్లరి పెరల్ అండ్ జమ్‌ఫెయిర్ 15వ ఎడిషన్‌ను పెట్టిందని, ఇందులో 250 కంటే ఎక్కువ టాప్ ఎగ్జిబిటర్ల ఉంటారని తెలిపారు. 600కు పైగా ప్రత్యేకమైన బ్రాండ్‌లను ప్రదర్శించడం ద్వారా 8000 వాణిజ్య కోనుగోలను దారులను ఆకర్షిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో 300 నుంచి 400 వరకు జాతీయ అభరణాల యూనిట్లు ఉన్నాయని వీటి ద్వారా ఎంతో మంది ఉపాధి పొందున్నారని తెలిపారు.బంగారు శుద్ధి కర్మాగారులు అందుబాటులోకి వస్తే ఆభరణాల తయారీలో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News