Tuesday, November 5, 2024

త్వరలో బంగారు శుద్ధి కర్మాగారాల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న సంస్థలు
రూ .700 కోట్ల పెట్టబడితో
2500 మందికి ఉద్యోగ అవకాశాలు

హైదరాబాద్: పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఇటు రాష్ట్ర అభివృద్ధికే కాకుండా అటు ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టి ఎస్ ఐ పాస్ లక్షం నెరవేరుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని పరిశ్రమల స్థాపనలో అగ్రస్థానంలో నిలపాలని 2015లో ప్రభుత్వం టిఎస్ ఐ పాస్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. టి ఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే రాష్ట్రంలోకి జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు రాగా మరి కొన్ని సంస్థలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖ ఆభరణాల దిగ్గజాలు తమ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు ప్రధాన బంగారు శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్కు పరిధిలో ప్రత్యేక బంగారు క్లస్టర్‌లో రిఫైనరీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇండిస్ట్రియల్ పార్క్‌లో గోల్డ్‌తో సహా మూడు బంగారు శుద్ది కర్మాగారాలు ఉన్నాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దాని తయారీ యూనిట్‌ను పూర్తి చేయడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన అతిపెద్ద బంగారు శుద్ది కర్మాగారాన్ని డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు. కంపెనీ తయారీ యూనిట్, రిఫైనరీలో రూ.700 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 2500 మంది అభరణాల తయారీదారులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టిఎస్ ఐ పాస్ ద్వారా రత్నాలు,అభరణాల పరిశ్రమ, మరో 13 ఇతర రంగాలలో అద్భుతమైన వృద్దిని సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా టిఎస్ ఐ పాస్ ప్రభుత్వ ప్రతిష్టను పెంచిందంటున్నారు.ఆకర్షణీయమైన ప్రోత్సహకాలను అందించడం, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో స్కిల్స్‌ను అభివృద్ది చేసిన నైపుణ్యం కలిగిన కార్మికులుగా తీర్చిదిద్దిడం ద్వారా కార్మికుల కొరతను పరిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు. నారాయణ పేట,కరీంనగర్‌లో జ్యూవెల్లరి అసొసియేషన్లకు భారీ ఎత్తున జాబ్‌వర్క్‌ను అందించేందుకు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసు కుంటున్నట్లు తెలిపారు.

ఇండస్ట్రియల్ పార్కులో రిఫైనరీ కార్యకలపాల కోసం సంస్థ నిర్వహకులు రూ.1000కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అదనపు బంగారుశుద్ధి కర్మాగారాల ప్రాసెసింగ్ యూనిట్‌ల కోసం భూములు కూడా అందు బాటులో ఉన్నాయన్నారు. ఒక్క హైదరాబాద్‌లోని 5000లకు పైగా అవుట్‌లెట్‌లు వీటి ద్వారా 400 మంది తయారీదారులకు ఈ అభరణాల పరిశ్రమలో స్థానికంగా ఉన్నవారికి ఉపాధి లభిస్తుందంటున్నారు.

ఇన్‌ఫార్మా మార్కెట్స్ హైదరాబాద్ జ్యూవెల్లరి పెరల్ అండ్ జమ్‌ఫెయిర్ 15వ ఎడిషన్‌ను పెట్టిందని, ఇందులో 250 కంటే ఎక్కువ టాప్ ఎగ్జిబిటర్ల ఉంటారని తెలిపారు. 600కు పైగా ప్రత్యేకమైన బ్రాండ్‌లను ప్రదర్శించడం ద్వారా 8000 వాణిజ్య కోనుగోలను దారులను ఆకర్షిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో 300 నుంచి 400 వరకు జాతీయ అభరణాల యూనిట్లు ఉన్నాయని వీటి ద్వారా ఎంతో మంది ఉపాధి పొందున్నారని తెలిపారు.బంగారు శుద్ధి కర్మాగారులు అందుబాటులోకి వస్తే ఆభరణాల తయారీలో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News