Wednesday, March 26, 2025

దిగొస్తున్న బంగారం ధర

- Advertisement -
- Advertisement -

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ.330 తగ్గి రూ.89,290కి చేరుకుంది. క్రితం రోజు ఇది రూ.89,620 గా ఉంది. అయితే వారం రోజుల క్రితం బంగారం ధర రూ.90 వేలు దాటింది. ఇక కిలో వెండి ధర రూ.1,10,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,440, ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,290గా ఉంది. ఇక కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,290, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,290గా ఉంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధర రూ.11,589 పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News