- Advertisement -
పసిడి వినియోగదారులకు గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఏకంగా తులం బంగారం 77వేలకు చేరుకుంది. దీంతో సామాన్య జనాలకు బంగారం అందని ద్రాక్షగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరపై రూ.760 తగ్గగా, 22 క్యారెట్ల ది గ్రాముల పసిడి ధరపై రూ.700 తగ్గింది.
ఇక, కేజీ వెండి ధరపై రూ.2,000 తగ్గింది. తాజా తగ్గుదలతో హైదరాబాద్ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,690కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300కి చేరుకుంది. కేజీ వెండి ధర రూ.లక్ష పలుకుతోంది.
- Advertisement -