- Advertisement -
దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయి. కొత్త సంవంత్సరంలో మూడు సార్లు తగ్గిన బంగారం ధరలు.. శనివారం స్వల్పంగా పెరిగాయి. ఎర్ర సముద్రంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి బలపడుతోంది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరిగగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.320, కిలో వెండిపై రూ.500లు పెరిగింది.
తాజాగా పెరిగిన ధరలతో తెలుగురాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.78,000కు చేరింది.
- Advertisement -