Sunday, January 5, 2025

దిగొస్తున్న బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

Gold rate Rs. 530 has fallen

హైదరాబాద్ : బంగారం ధరలు దిగొస్తున్నాయి. పసిడి ధరలు దిగిరావడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలుగుతుంది. నేడు మార్కెట్‌లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్‌లో బంగారం ధర భారీగా పడిపోయింది. ఈ రోజు బంగారం రేటు రూ. 530 మేర పడిపోయింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. దీంతో ఈ పసిడి రేటు రూ. 50,200కు దిగి వచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు రూ. 500 క్షీణించింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. దీంతో ఈ బంగారం రేటు రూ. 46 వేలకు పడిపోయింది. కాగా పసిడి రేటు గత రెండు రోజుల్లో రూ. 700కు పైగా పెరిగిన విషయం తెలిసిందే.

వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ రేటు కూడా పడిపోయింది. ఏకంగా రూ. 1000 పతనమైంది. దీంతో కేజీ వెండి రేటు రూ. 61,500కు దిగివచ్చింది. వెండి రేటు నిన్న కూడా దిగివచ్చింది. రూ. 500 మేర పడిపోయింది. అంటే సిల్వర్ రేటు రెండు రోజుల్లో రూ. 1500 పతనమైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. వెండి రేటు పతనమైంది. ఏకంగా 4 శాతం మేర కుప్పకూలింది. దీంతో సిల్వర్ రేటు ఔన్స్‌కు 18.8 డాలర్లకు దిగి వచ్చింది. కాగా వెండి రేటు ఇటీవల 20 డాలర్ల సమీపానికి చేరిన విషయం తెలిసిందే. అలాగే బంగారం రేటు కూడా పడిపోయింది. పసిడి రేటు ఔన్స్‌కు 1.75 శాతం కుప్పకూలింది. దీంతో బంగారం రేటు ఔన్స్‌కు 1651 డాలర్లకు దిగివచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని చెప్పుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News