Monday, April 21, 2025

బంగారం రేటుకు రెక్కలు.. 10 గ్రాములు రూ.లక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగారం కొనుగోలు సామాన్యులకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి బంగారం ధరలు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. సోమవారం ఒక్కరోజే బంగారం రూ.2,350 పెరిగింది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని తాకడం ఇదే తొలిసారి. అమెరికా-చైనా సుంకాల యుద్ధం వల్ల బంగారం ధరలు పెరిగిపోయాయి. దీంతో డాలర్ బలహీనపడి.. మదుపర్లు బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం సోమవారం 3,405 డాలర్లకు చేరింది. దీన్ని అనుసరించి సోమవారం సాయంత్రం 5.30 గంటలకు 24 క్యారెట్ల బంగారం రూ.1,00,016కు చేరింది. ఈ ఏడాదిలో బంగారం దాదాపు రూ.20వేలకు పైగా పెరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News