Thursday, August 29, 2024

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

దేశంలో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే తులం బంగారం 74 వేల రూపాయలకు చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం మరోసారి భారీగా బంగారం ధరలు పెరిగాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.900 పెరిగి రూ.68,750కు చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.980 పెరిగి రూ.75వేలకు చేరింది. ఇక, వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కేజీ వెండి ధర రూ.1000 పెరిగి రూ.96వేలకు చేరుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.68,750గా ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75గా ఉంది. ఇక, కిలో వెండి ధర రూ.1,00500కు చేరుకుంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News