Saturday, December 21, 2024

తగ్గిన బంగారం, వెండి ధరలు

- Advertisement -
- Advertisement -

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. దేశంలో స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.440 తగ్గింది. ఇక, కిలో వెండి ధరపై రూ.700 తగ్గింది. తాజా తగ్గుదలతో తెలగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.66,100కు చేరుకుంది. ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,110గా ఉంది. ఇక, కిలో వెండి ధర రూ.97,300కు చేరింది. విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News