Saturday, April 5, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. తాజాగా పసిడి ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే 90 వేలు దాటిన తులం బంగారం ధర.. లక్ష రూపాయల వైపు దూసుకుపోతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో  పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్ మార్కెట్లోనూ బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 540 మేర పెరిగి రూ. 93,380కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 500 మేర పెరిగి రూ. 85,600కు పెరిగింది. మరోవైపు, వెండిపై 100 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.1,11,900కు చేరుకుంది. ఇక, ఎపిలోని విశాఖ, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News