Wednesday, April 16, 2025

పెళ్లిళ్ల సీజన్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. మరోసారి పసిడి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే సామాన్యలు కొనలేని స్థితికి బంగారం ధరలు చేరుకున్నాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.950 పెరిగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 990 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.88,150కు చేరుకుంది. ఇక, 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.రూ.96,170కు పెరిగింది. అలాగే, వెండి ధర కూడా రూ. 200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,10,000గా కొనసాగుతోంది.

ఎపిలోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. కాగా, తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరువగా వస్తుండటంతో ప్రజలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. అయితే, పెళ్లిళ్ల సీజన్ తర్వాత మళ్లీ పసిడి ధరలు తగ్గొచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News