హైదరాబాద్: అమెరికా సిపిఐ, రిటైల్ అమ్మకాల డేటా విడుదల కావడంతో బంగారం కొనుగోలుదారులకు చాలా ఉపశమనం కలిగింది. హైదరాబాద్, ఇతర నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. అమెరికా మాంద్యంలోకి జారుకుంటుందనే భయం తగ్గింది. నెల కనిష్ఠానికి బంగారం ధరలు తగ్గినా, అమెరికా ఫెడ్ రేట్ల పెంపు ఊహాగానాలను ఈ డేటా అర్థం లేకుండా చేసింది.
డాలర్ విలువ బలపడుతున్నందున, బాండ్ రాబడులు పెరుగుతున్నందున పెట్టుబడుదారులు బంగారంపై పెట్టుబడిని తగ్గించి, ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికలవైపు దృష్టి సారిస్తున్నారు. మాంద్యం భయాలు తగ్గినందున ఇక బంగారంపై పెట్టుబడి అంత ఆకర్షణీయంగా కనపడ్డంలేదు. అందుకనే మదుపరులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.
హైదరాబాద్, ఇతర నగరాల్లో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఇటీవలి వరకు బంగారం ధర అత్యధిక స్థాయికి పెరుగుతూ పోయింది. బంగారం అమ్మకాలు పడిపోయినట్లు చాలా మంది బంగారం వర్తకులు తెలిపారు. బంగారం అమ్మకాలు పెంచేందుకు దిగుమతి పన్నును తగ్గించాలని వర్తకులు డిమాండ్ చేశారు. కానీ కేంద్ర బడ్జెట్ ఎలాంటి మార్పు చేయకపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. ఇప్పటికీ దిగుమతి సుంకం 15 శాతం కొనసాగుతోంది.
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో ఒక నెల కనిష్ఠ ధరలో బంగారం లభ్యమవుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్‌లది రూ. 56510గా, 22 క్యారెట్‌ల బంగారం ధర రూ. 51800గా ఉంది. ప్రాపంచిక కారణాల వల్ల బంగారం ధరలు పడిపోయినప్పటికీ, మార్కెట్ నిపుణులు ఇదివరలో 10 గ్రాముల బంగారం ధర రూ 60000కు చేరుకోగలదని సూచించారు.
Cities | 22K (in rupees) | 24K (in rupees) |
Hyderabad | 51800 | 56510 |
New Delhi | 51950 | 56610 |
Mumbai | 51800 | 56510 |
Chennai | 52450 | 57220 |
Kolkata | 51800 |
56510
|
Name | 1 Gram | 1 Ounce |
---|---|---|
Gold 24 Karat (Rs ₹) | 5,644 | 160,005 |
Gold 22 Karat (Rs ₹) | 5,174 | 146,671 |
Gold 20 Karat (Rs ₹) | 4,703 | 133,337 |
Gold 18 Karat (Rs ₹) | 4,233 | 120,004 |