Monday, December 16, 2024

హైదరాబాద్ లో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాజాగా నగరంలో బంగారం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల (జియోపోలిటికల్ టెన్షన్స్) నేపథ్యంలో బంగారం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరుగుతుండడం, అదే పోకడ మన మల్టీ కామాడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసిఎక్స్)లో కనిపించింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73310(+ 1090), అంటే 1.51 శాతం పెరుగుదల, ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67200(+ 1000) అంటే 1.51 శాతం పెరుగుదల నమోదయింది.

హైదరాబాద్ లో గత 12 రోజుల్లో బంగారం ధర 5.66 శాతం మేరకు పెరిగింది. మధ్యప్రాచ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం…భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధర పెరిగినట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News