- Advertisement -
లక్ష రూపాయలకు చేరువైన బంగారం ధరలు.. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల ఎఫెక్ట్ తో గత నాలుగైదు రోజులుగా తగ్గుతూ వచ్చాయి. ఇలానే భారీగా పసిడి ధరలు తగ్గుతాయని ఆశించిన కొనుగోలు దారులకు షాక్ తగిలింది. ఇవాళ ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగాయి.
బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై 710 రూపాయలు పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 650 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.90,440కు చేరుకోగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.82,900కు పెరిగింది. ఇక, వెండి ధర రూ.1000 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,02,000 పలుకుతోంది.
- Advertisement -