Thursday, January 16, 2025

రూ.70 వేలకు బంగారం

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజతీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ ఏడాదిలో బంగారం 10 గ్రాముల ధర రూ.70 వేలకు పెరగనుందని ఇండస్ట్రీ బాడీ జిజెసి (జెమ్స్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్) అంచనా వేసింది. సురక్షిత పెట్టుబడిగా, ద్రవ్యోల్బణాన్ని అధిగమించేదిగా బంగారానికి ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని సంస్థ పేర్కొంది. జిజెసి చైర్మన్ సైయమ్ మెహ్రా మాట్లాడుతూ,

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వడ్డీ రేట్లతో ఆర్థిక మార్కెట్లు ఆందోళనతో ఉన్నాయని, ఇన్వెస్టర్లు బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారని, 2024లో కూడా పసిడి ధర పెరనుందని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.65,500 (24 క్యారెట్) వద్ద ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2024లో 10 గ్రాముల బంగారం రూ.70 వేలకు చేరుకోనుంది. ఇక ఇక వెండి విషయానికి వస్తే కిలో రూ.85 వేలకు చేరే అవకాశముంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News