Sunday, December 22, 2024

షాకింగ్ ఘటన.. శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన బంగారు చీర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విమానాశ్రయాల ద్వారా బంగారం స్మగ్లింగ్‌కు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అయితే విమానాశ్రయాల్లో తనిఖీ వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఇలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. బంగారు చీర పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి బట్టలపై స్ప్రే చేసి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు.

అతడి నుంచి 471 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారం విలువ రూ.28.01 లక్షల వరకు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. నిందితులు ఇంతలో కస్టమ్స్ అధికారులను మోసగించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని కస్టమ్స్ అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News