Thursday, November 14, 2024

జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలో… బిసి గురుకుల విద్యార్థులకు బంగారు పతకం

- Advertisement -
- Advertisement -

హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో బిసి గురుకుల విద్యార్థికి బంగారు పతకం రావడం పట్ల బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎస్‌జిఎఫ్ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలో నలుగురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో నల్గొండ జిల్లా తుమ్మడం బిసి గురుకుల పాఠశాలకు చెందిన జి. భవజ్ఞ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. అలాగే మరో ముగ్గురు విద్యార్థులు ఎం.అక్షయ (8వ తరగతి), కె.హరిప్రియ (7వ తరగతి), జె.మనశ్విని (8వ తరగతి) రజత పతకాలు సాధించారు.

పతకాలు సాధించిన విద్యార్థులను ఈ సందర్బంగా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. భవిష్యత్‌లో బిసి గురుకుల పాఠశాలకి చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. వారికి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. క్రీడాకారులను అభినందించిన వారిలో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం , ఎంజెపి కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News