- Advertisement -
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు సూడాన్ మహిళల దగ్గర అధికారులు బంగారాన్ని గుర్తించారు. 3.17కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.1.94 కోట్ల ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -