- Advertisement -
ముంబయి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బ్యాంకాక్ నుంచి వచ్చి వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని తనిఖీ చేయగా అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షూలో దాచి తరలించేందుకు ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, సీజ్ చేసిన బంగారం ధర మార్కెట్ లో దాదాపు రూ.6 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -