హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం నాడు 381 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 6 ఇ – 25 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడ్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా సూట్ కేస్ ఫ్రేమ్‌లో బంగారం బయటపడటంతో బంగారం స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేస్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రేమ్‌లో దాచి తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.13.6 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సదరు వ్యక్తిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. బంగారాన్ని అతని సూట్‌కేస్ యొక్క ప్రత్యేకంగా రూపొందించిన లోపలి ఫ్రేమ్ లో దాచారని పేర్కొన్నారు.
ప్రయాణికుడిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. మొత్తంగా 381 గ్రాముల 18 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇదిలావుండగా ఇటీవలే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడు బంగారాన్ని తీసుకువస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి రూ.60 లక్షల విలువైన 1.2 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ బంగారం దుబాయ్ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
చెక్‌పోస్టులో రూ.1.04 కోట్ల వజ్రాలు,బంగారం పట్టివేత
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసుల బుధవారం నడు జరిపిన తనిఖీల్లో రూ.1.04 కోట్ల వజ్రాలు,బంగారం , వజ్రాలు, ముత్యాల ఆభరణాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి మధురైకి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగాపోలీసులు గుర్తించారు. సరైన ఆధారాలు లేకపోవడం వల్ల వాటిని సీజ్‌చేయడంతో పాటు ఇద్దరిని అరెస్టు చేశారు. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు 518 గ్రాములు, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలు 579 గ్రాములు, 60 లక్షల 54 వేల రూపాయల విలువైన వజ్రాలు, 27 వేల రూపాయల విలువైన ముత్యాలు ఉన్నాయని, మొత్తం వీటి విలువ 1.04 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.