- Advertisement -
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారం తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒక ప్రయాణికుడిపై అనుమానం వచ్చి వారి లగేజీని స్కాన్ చేయగా ప్రయాణికుల బ్యాగ్‌లో 610 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు.
పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.కోటి 32.8 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అదనంగా మరో ప్రయాణికుడు 483 గ్రాముల బంగారాన్ని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దానిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి.
- Advertisement -