Sunday, January 19, 2025

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అక్రమంగా బంగారం తీసుకుని వచ్చిన ప్రయాణికుడి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు శనివారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.47లక్షల విలువైన 823 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తి బంగారాన్ని పేస్టుగా మార్చి ప్లాస్టిక్ కవర్‌లో ప్యాకింగ్ చేసి లోదుస్తులలో దాచి తరలించేందుకు యత్నం చేశాడు. కాని కస్టమ్స్ అధికారులు స్క్రీనింగ్ చేయడంతో అక్రమంగా తరలిస్తున్న బంగారం విషయం బయటపడింది. ప్రయాణికుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News