Monday, December 23, 2024

క్యాప్సూల్స్ రూపంలో బంగారం తరలింపు

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుధవారం మరోసారి భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టుబడింది. కేసుకు సంబంధించిన వివరాలను కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుండి ఈకె-524 విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన నలుగురు సుడాన్ దేశపు మహిళలు. అయితే వారు బంగారాన్ని క్యాప్సిల్స్ రూపంలో తయారు చేసి వాటిని ప్యాకింగ్ చేసి లగేజీలో పెట్టుకుని తెచ్చారు.

అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వారి లగేజీ బ్యాగులను చెకింగ్ చేసిన కస్టమ్స్ అధికారులు. దీంతో వారి బ్యాగ్‌లో క్యాప్సిల్స్ రూపంలో ఉన్న బంగారం బయటబడింది. పట్టుబడ్డ బంగారం 3175 గ్రాములు ఉంటుందని దాని విలువ బహిరంగ మార్కెట్లో 1.943 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News