Thursday, December 19, 2024

శంషాబాద్‌లో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రియాద్ నుండి హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద 1818.98 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు. ప్రయాణికులు అక్రమ బంగారాన్ని పొడిగా తయారుచేసి దానిని షూస్‌లో దాచుకొని తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. నిందితుల వద్ద నుండి బంగారం స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 1.13.13.558 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News