- Advertisement -
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి కోటి విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటలకు ఇండిగో ఫ్లైట్ నెంబర్ 6ఇ-1484లో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల వ్యవహారశైలి అనుమానంగా వుండటంతో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు వారిని అడ్డగించారు.
వారిని తనిఖీ చేయగా పురీషనాళంలో బ్లాక్ టేప్‌తో చుట్టి బంగారం పేస్ట్‌తో కూడిన ఆరు క్యాప్సూల్స్ దాచినట్లు తేలింది. అనంతరం ఇద్దరు ప్రయాణీకుల నుంచి రూ.1.05 కోట్ల విలువైన 1705.3 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ కస్టమ్స్ చట్టం 1962 కింద సదరు ప్రయాణీకులిద్దరిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ చేపట్టారు.
- Advertisement -